Hyderabad, ఆగస్టు 1 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురామ్‌పై చూపిస్తున్న కేర్ గురించి చంద్రకళకు థ్యాంక్స్ చెబుతాడు విరాట్. కొడుకు కంటే ముందే కొడుకులా మంచి ట్రీట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నావ్ అని చంద్రకళను అంటాడు విరాట్. నేను కుట్ర చేస్తున్నాను అందరూ నన్ను అంటుంటే నువ్ మాత్రమే నన్ను నమ్మి సపోర్ట్‌గా నిలిచావ్. అందుకు నీకే థ్యాంక్స్ చెప్పాలి బావ అని చంద్రకళ అంటుంది.

రేపు గడువులోగా మావయ్యకు నయం కాకపోతే నేను ఇంట్లోంచి వెళ్లే పరిస్థితి వస్తుంది. అప్పుడు నువే ఏ వైపు స్టాండ్ తీసుకుంటావని విరాట్‌ను చంద్రకళ అడుగుతుంది. అంత దూరం ఆలోచించలేదు. కానీ, నీ ప్రయత్నం చూస్తుంటే గడువులోపే నాన్నకు నయం అయ్యేలా చేస్తావనిపిస్తుందని వెళ్లిపోతాడు విరాట్. ఆ మాటలు విన్న శాలిని తెగ కంగారుపడిపోతుంది.

మరోవైపు రఘురాం కోలుకోవాలని కామాక్షి, శ్రుతి మాట్లాడుకుంట...