భారతదేశం, ఆగస్టు 7 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 7వ తేదీ ఎపిసోడ్ లో అగ్రిమెంట్ కోసం అర్జున్ ఆఫీస్ కు వెళ్తుంది చంద్రకళ. మీరు పికిల్స్ క్వాలిటీ అండ్ టేస్ట్ చూసుకోండి. అగ్రిమెంట్ పేపర్స్ బాగా చదివి సంతకం చేయండని అర్జున్ అంటాడు. విట్నెస్ సంతకం మీ హస్బెండ్ తో పెట్టించండని అర్జున్ చెప్తాడు. చంద్ర, అర్జున్ సంతకాలు పెట్టేస్తారు. మెటీరియల్, స్టాఫ్ రెడీగా ఉన్నారని అర్జున్ చెప్తాడు. అందరికీ స్వీట్లు పంచాలని చంద్ర అనుకుంటుంది. టేబుల్ మీద లడ్డూలు పెడితే కామాక్షి, శ్రుతి తింటారు. శ్యామల, శాలిని కూడా తింటారు.

స్వీట్లు ఎవరు తెచ్చారని విరాట్ అడగడంతో అందరూ కంగుతింటారు. ఎవరు తీసుకొచ్చారంటే నేనే అని చెప్తుంది చంద్రకళ. నా బిజినెస్ ను పెద్ద లెవల్లో స్టార్ట్ చేస్తున్నానని అర్జున్ గురించి చెప్తుంది చంద్ర. అగ్రిమెంట్ కూడా అయిందని అంటుంది చంద్ర. సగం లడ్డూను...