భారతదేశం, ఆగస్టు 6 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 6వ తేదీ ఎపిసోడ్ లో చాకు పట్టుకుని చనిపోతానని శాలిని బెదిరిస్తుంది. చేయి కట్ చేసుకుంటుంది. నువ్వు శత్రువులా చూస్తుంటే ప్రతి క్షణం నరకంలా ఉంది. నేను చచ్చిపోతాను బతకను అని క్రాంతితో అంటుంది. చేయి కట్ చేసుకుని కపట ప్రేమ చూపిస్తుంది శాలిని. ఇంకెప్పుడూ నిన్ను బాధ పెట్టే పని చేయని ప్రామిస్ క్రాంతి అని అంటుంది. గతాన్ని తీసేయాలని శాలిని అంటే.. అదంతా తేలిక కాదు టైమ్ పడ్తుందని చెప్పి క్రాంతి వెళ్లిపోతాడు. నాకు తెలుసు నేనెం చేస్తే నువ్వు కరుగుతావోనని శాలిని అనుకుంటుంది.

రాత్రి అర్జున్ నుంచి చంద్రకళకు ఫోన్ వస్తుంది. పార్ట్ నర్ షిప్ కు ఓకే చెప్తుంది. ఆఫీస్ కు రమ్మని లోకేషన్ పంపిస్తాడు అర్జున్. అప్పుడే కరెంట్ పోతుంది. చీకట్లో విరాట్ కు డాష్ ఇస్తుంది చంద్ర. అప్పుడు చంద్రను పట్టుకుని రొమాంటిక్ లుక్ ఇస...