భారతదేశం, ఆగస్టు 5 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 5వ తేదీ ఎపిసోడ్ లో శ్యామల కాళ్లు, చేతులు నొక్కుతూ కాకా పడతారు కామాక్షి, శ్రుతి. నిజానికి విరాట్ బావ పెళ్లి చేసుకోవాల్సింది నన్ను పెద్దమ్మ. అత్తయ్య మాకు ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేసిందని శ్రుతి అంటుంది. కానీ చంద్ర వదినను మాయ చేసిందని కామాక్షి చెప్తుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నారని శ్యామల అంటే.. శ్రుతి, విరాట్ లను ఒక్కటి చేసే అవకాశం ఇంకా ఉంది కాబట్టి అని కామాక్షి అంటుంది.

30 రోజుల తర్వాత చంద్రకళ వెళ్లిపోతే విరాట్, శ్రుతికి పెళ్లి చేయాలని కామాక్షి కోరుతుంది. కానీ విరాట్ పక్కన శ్రుతి సెట్ కాదని, అన్ని పనులు చకచకా చేయాలని శ్యామల అంటుంది. శ్యామలను ఇంప్రెస్ చేసే పని పెట్టుకోమని కూతురికి చెప్తుంది కామాక్షి.

మరోవైపు షాప్ తాళాలను అర్జున్ కు చంద్రకళ చేతుల మీదుగా ఇవ్వాలని కోరతాడు దామోదర్. ఆల్ ద...