భారతదేశం, ఆగస్టు 4 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 4వ తేదీ ఎపిసోడ్ లో స్టోర్ రూమ్ లో పడుకున్న చంద్రకళకు దుప్పటి కప్పుతాడు విరాట్. అప్పుడు విరాట్ చేతిని మెడ కింద పెట్టుకుంటుంది చంద్ర. అప్పుడు ఓ రొమాంటిక్ ఫీల్ వస్తుంది. చంద్రకళను చూస్తూ ఉండిపోతాడు విరాట్. ప్రేమగా తల నిమురుతాడు. ఎంత ముద్దుగా పడుకున్నావే, గుడ్ నైట్ బంగారం అని చెప్పి వెళ్లిపోతాడు.

ఉదయం చంద్రకళ పూజ చేస్తుంది. జగదీశ్వరీ మసాజ్ ఆయిల్ తీసుకుని వస్తుంది. నేను ఆల్రెడీ మసాజ్ చేశాను అత్తయ్య అని చెప్తుంది చంద్రకళ. మామయ్య త్వరలోనే కోలుకోవాలని కోరుకుంటుంది చంద్ర. దేవుడి దగ్గర ఎలాంటి భేధాలు ఉండవు, హారతి తీసుకోమని శ్యామలకు చెప్తుంది చంద్ర. జోకర్ల ముందు ఎవరైనా జోక్ లు వేస్తారా? అని శ్రుతి, కామాక్షిపై సెటైర్లు వేస్తుంది చంద్రకళ. అప్పుడే చంద్రకళ నడుము దగ్గర ఉన్న తాళాలను శాలిని లాక్కుని, ఇవ...