భారతదేశం, ఆగస్టు 28 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 28వ తేదీ ఎపిసోడ్ లో ఇన్వెర్టర్ రిపేర్ చేస్తానని బిల్డప్ ఇచ్చిన శ్రుతికి కరెంట్ షాక్ కొడుతుంది. లేని గొప్పలకు పోతే అలానే అవుతుందని శ్రుతిపై కోప్పడతారు అందరూ. నేను చూస్తానని చంద్రకళ అంటే దానికి షాక్ కొట్టింది చాలదా? నీకు సరదగా ఉందా ఏంటీ? అని శ్యామల అంటుంది. అయినా చంద్ర చూసి రిపేర్ చేయడంతో పవర్ వస్తుంది. ఏమైందే నీ ఇంజినీరింగ్ చదువు అంటూ శ్రుతిపై మండిపడుతుంది శ్యామల. ఇలాంటి పనులకు ఇంప్రెస్ అయ్యి నిన్ను క్షమిస్తారేమో అనుకోకు అలాంటిదేం లేదని చంద్రతో శ్యామల అంటుంది.

శాలిని ఓ పేపర్ ప్రింట్ తీయిస్తుంది. ఈ పేపర్ కొరియర్ రూపంలో మా ఇంటికి రావాలని కొరియర్ బాయ్ ను అడుగుతుంది శ్రుతి. వెయ్యి రూపాయాలు అవుతాయని అడుగుతాడు కొరియర్ బాయ్. రూ.500 తీసుకుని అడ్జస్ట్ అవ్వు అని రిక్వెస్ట్ చేస్తుంది శ్రుతి. సరి...