భారతదేశం, ఆగస్టు 22 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 22వ తేదీ ఎపిసోడ్ లో తోరలు తీసుకురమ్మని పంతులు చెప్తాడు. శ్యామలను తీసుకురమ్మని క్రాంతి చెప్తే, పైకి వెళ్లమని ఆ పనిని శ్రుతికి అప్పగిస్తుంది శ్యామల. వ్రతంలో కూర్చున్న చంద్రకళ తన కాలితో విరాట్ కాలికి రాస్తుంది. పూజ మధ్యలో ఈ పనులేంటీ అని విరాట్ అడుగుతాడు. నన్ను సర్ ప్రైజ్ చేసేందుకు ఇలా చేశావు కదా బావ అని అడుగుతుంది చంద్రకళ. ఎన్ని రోజులు బయటపడకుండా ఉంటావో చూస్తానని చంద్ర అనుకుంటుంది.

శ్రుతి వచ్చి పైన టీపాయ్ మీద ప్లేట్లు లేవని చెప్తుంది. తోరం కట్టకుండా అమ్మవారికి చీర సమర్పించకూడదని పంతులు చెప్పడంతో అందరూ కంగారు పడతారు. రెడీ చేసి పెట్టుకున్నవి ఎలా మిస్ అవుతాయని అన్న జగదీశ్వరి.. శ్యామలను వెళ్లి చూసి రమ్మంటుంది. వదిన నాక్కూడా ఎక్కడా కనిపించలేదని శ్యామల చెప్పగానే అందరూ షాక్ అవుతారు. శాలినిపై డ...