Hyderabad, అక్టోబర్ 9 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రను పెళ్లి చేసుకుని నీకు అన్యాయం చేశాను అని విరాట్ అంటాడు. చంద్ర పోయాక రేపు ఇదే మాట మీద ఉండు బావ శ్రుతి అంటే నువ్వు చెప్పే ఆ రేపటికి రూపం లేదని చంద్రకళ అంటుంది. శ్యామల అందరిని పిలుస్తుంది. ఇతరులకోసం ఫైట్స్ చేసి పోరాటాలు చేయడం ఇక ఆపండి. రేపు దసరా పండుగ. గుర్తు చేద్దామని పిలిపించాను అని శ్యామల అంటుంది.

గుర్తుంది. పూజ చేయించాలని కూడా అనుకున్నా అని చంద్రకళ అంటుంది. కానీ, పూజ చేయాల్సింది మీరు కాదు. మా అన్నయ్య, మా వదిన అని శ్యామల చెబుతుంది. దాంతో అంతా సంతోషిస్తారు. ఆయన చేతుల మీదుగా పూజ చేస్తే అమ్మవారు కరుణిస్తుందేమో అని జగదీశ్వరి అంటుంది. దానికి అంతా సపోర్టింగ్‌గా మాట్లాడుతారు. రేపు ఎలాంటి ఆటంకం లేకుండా పూజ సజావుగా జరగాలి. ఎవరి వల్ల అయిన జరిగితే నేను ఊరుకోను అని శ్యామల అంటుంది....