భారతదేశం, అక్టోబర్ 8 -- నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 8 ఎపిసోడ్ లో అమ్మ మనసులో చంద్ర తప్పు చేయలేదనే నమ్మకం ఉంది. అందుకే మౌనంగా ఉందని శ్యామల, కామాక్షితో అంటాడు విరాట్. మాటలతో చంద్రను హింసించకండని అంటాడు విరాట్. ఇది నా లైఫ్, నాకు ఏం కావాలో మీరు డిసైడ్ చేయకండి ప్లీజ్ అని అంటాడు.

రూమ్ లో ఉన్న విరాట్ ను వెనకాల నుంచి హగ్ చేసుకుంటుంది చంద్రకళ. విరాట్ కూడా హత్తుకుంటాడు. చంద్ర ప్లేస్ తీసుకోవడానికి లైన్లో నేనున్నా. మరి శ్వేతను అడగడం ఏంటీ అని తల్లి దగ్గర ఆవేశపడుతుంది శ్రుతి. ఇక నుంచి పెద్దమ్మను కూడా టార్గెట్ చేయాలన్నమాట అని శ్రుతి అంటుంది. శ్యామల దెబ్బ నీ మీద పడితే పచ్చడి అవుతావని కామాక్షి చెప్తుంది.

నా తప్పును మన్నించి మీ ఇంటి మనిషిలా చూశారు. నా సమస్య తీర్చారు. ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను. థ్యాంక్స్ చంద్ర. మీ వల్ల ప్రాబ్లెం సాల్వ్ అయ...