భారతదేశం, అక్టోబర్ 7 -- నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 7వ తేదీ ఎపిసోడ్ లో నువ్వు ఎప్పుడైనా నా అల్లుడిని మిస్ అయ్యావా? విరాట్ విషయంలో నీకు ఇంకో అవకాశం దొరికే అదృష్టం ఉంది. ఆ అదృష్టం నీకుందో లేదో ఓ వారం రోజుల్లో తెలిసిపోతుంది. ఓ పది రోజులు ఉండేసి వెళ్లు అని శ్యామల అంటుంది. అది విన్న జగదీశ్వరి గట్టిగా అరుస్తుంది.

ఏం చేస్తున్నావ్ నువ్వు? పరాయి అమ్మాయి ముందు ఏంటీ మాటలు? ఇంటి విషయాలు సొంతవాళ్ల మధ్య డిస్కస్ చేయాలి. ఈ మధ్య నీ ఆలోచనలు హద్దు మీరుతున్నాయి శ్యామల అని జగదీశ్వరి అంటుంది. రేప్పొద్దున చంద్రకళ తప్పు తేలితే అప్పుడు విరాట్ ఒంటరివాడు అవుతాడని అంటున్నానని శ్యామల చెప్తుంది. శ్వేతను మళ్లీ విరాట్ జీవితంలోకి రమ్మని అనడం చాలా తప్పంటుంది జగదీశ్వరి.

అత్తయ్య అలా మాట్లాడింది ఏంటీ శాలిని? అని అడుగుతాడు క్రాంతి. శ్వేత ముందు వదిన ముందు అలా మాట్లాడటం...