Hyderabad, అక్టోబర్ 4 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్, చంద్ర, శ్వేత ఇంకా ఇంటికి రాకపోవడంపై శ్యామలతో శ్రుతి, కామాక్షి డిస్కషన్ పెడతారు. క్రాంతి కాల్ చేస్తే కలవదు. వాళ్లు గుడికే వెళ్లలేదు. గుడికి అని చెప్పి ఇంకా ఎక్కడికో వెళ్లారు. ఇదంతా చంద్రకళ ప్లాన్ అనిపిస్తుంది. వాళ్లను కలవొద్దు అన్నావుగా. కావాలనే శ్వేతను చంద్రకళ పిలిచి ఉంటుంది అని కామాక్షి అంటుంది.

మరోవైపు శ్వేతను ప్రమోద్ ఏం చేస్తున్నాడో అని విరాట్‌తో చెబుతూ భయపడుతుంది చంద్రకళ. మరోవైపు నువ్వు ఐదు లక్షలు ఇస్తానన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. నీకు డబ్బు దక్కదు, ఫొటోలు దక్కవు అని బ్యాగ్ తీసి చూస్తాడు ప్రమోద్. కానీ, అందులో డబ్బుకు బదులు బట్టలు ఉంటాయి. అది చూసి ప్రమోద్ షాక్ అవుతాడు. దాంతో శ్వేత గొంతు పట్టుకుంటాడు.

నీ హెయిర్ పిన్ ఇవ్వు అని చంద్రను విరాట్ అడుగుతాడు. మరోవైపు ల్యా...