భారతదేశం, అక్టోబర్ 30 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శాలినిని హిప్లటైజే చేయిస్తాడు విరాట్. కానీ, శాలిని అందులో అబద్దం చెబుతుంది. మరోవైపు గుడిలో హోమం చేయిస్తుంది చంద్రకళ. ఈ హోమం నీ అంతరాత్మకే పరీక్ష. నీ ఉద్దేశం సరైనది కాకపోతే నువ్వు ఎంత నిష్టగా పూచ చేసిన దాని త్యాగఫలం దక్కదు అని స్వామిజీ అంటాడు.

నా దీక్ష దేనికో మీకు తెలుసు. దేవుడికి తెలుసు. నన్ను రక్షిస్తాడో, శిక్షిస్తాడో దేవుడి ఇష్టం అని పూజలో కూర్చొంటుంది చంద్రకళ. హోమం స్టార్ట్ చేస్తారు. అత్తయ్య మావయ్య కష్టాల నుంచి విముక్తి పొందాలి. నేను ఏ తప్పు చేయలేదని తెలుసుకోవాలి అని చంద్రకళ మనసులో కోరుకుంటుంది. అగ్ని స్వచ్ఛమైనది. నీ కోరిక మంచిదో చెడుదో ఈ అగ్ని చెబుతుందని స్వామిజీ అంటాడు.

ఈ పూర్ణాహుతి అగ్నిలో వేస్తే అగ్ని చల్లారిపోతే నీ కోరిక స్వచ్ఛమైనది కాదు అని అర్థం. ఎగసి పడిందంటే ఆ దేవ...