భారతదేశం, అక్టోబర్ 29 -- నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 29 ఎపిసోడ్ లో ఇవన్నీ చూస్తుంటే నాకే ఆయన్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనిపిస్తోందని జగదీశ్వరి బాధ పడుతుంది. ఈ గొడవలు పక్కనపెట్టి ముందు ఎవరి పనులు వాళ్లు చేసుకోండి. శాలినికి టెస్టులు చేయిస్తాన్నవావు కదా క్రాంతి. నాలుగు రోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని శ్యామల చెప్తుంది.

డాక్టర్ కు విరాట్ కాల్ చేస్తాడు. డాక్టర్ ను ఓ ఫేవర్ ఆడుగుతాడు. హాస్పిటల్ వెళ్లి డాక్టర్ ను కలుస్తాడు. సైక్రియార్టిస్ట్ ను కలుస్తాడు విరాట్. శాలినిని అడగాల్సిన ప్రశ్నలను డాక్టర్ కు ఇస్తాడు విరాట్. ఇది సీరియస్ మ్యాటర్ అని డాక్టర్ అంటే, చాలా సీరియస్ అని విరాట్ చెప్తాడు. మా నాన్న ప్రాణాలకే ప్రమాదం ఉందని, హెల్ప్ చేయమని అడుగుతాడు.

లేడీ డాక్టర్ శాలినికి సైక్రియార్టిస్ట్ ను కలవమని చెప్తుంది. హిప్నటైజ్ థెరపీతో న...