భారతదేశం, అక్టోబర్ 28 -- నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 28 ఎపిసోడ్ లో మామయ్యను కొట్టింది శాలినియే అని క్రాంతికి చెప్తుంది చంద్రకళ. నువ్వు అదే మాట అంటున్నావా వదినా? అని క్రాంతి అడుగుతాడు. నువ్వు విడాకులు ఇస్తానంటే ఓ ఛాన్స్ ఇవ్వమంది నేనే. ఇప్పుడు నేను చెప్పేది నమ్మవా? అని అడుగుతుంది చంద్ర. కానీ క్రాంతి మాత్రం భార్యకు సపోర్ట్ చేస్తాడు.

వద్దు వదిన, ఇంకేం మాట్లాడొద్దు. ఇంటి నుంచి వెళ్లకుండా ఉండేందుకే నింద వేస్తున్నావని అనుకున్నా. కానీ తప్పు చేసి తప్పించుకోవాలని అనుకుంటున్నావని చంద్రకళతో క్రాంతి అంటాడు. నేను ఆ పని ఎలా చేశానని నమ్ముతున్నావని చంద్ర అంటుంది. నమ్మడమే నా తప్పు. ఇప్పుడు ఒక్కొక్కరి అసలు రూపాలు తెలుస్తున్నాయని క్రాంతి అంటాడు.

తేజును సేవ్ చేయడానికి ఫారెన్ డాక్టర్లను కన్సల్ట్ చేస్తానని డాక్టర్ తో అర్జున్ అంటాడు. కానీ అప్పటికే తన ఫ్ర...