భారతదేశం, అక్టోబర్ 27 -- నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 27 ఎపిసోడ్ లో గుడిలో స్వామిజీని కలుస్తుంది చంద్రకళ. ఆ స్వామిజీ చంద్ర తలరాతను చదువుతాడు. నీ ఇంటి పెద్ద దిక్కు కోలుకుంటే తప్ప నీ జీవితం నిలబడేలా లేదు అవునా? నీ జీవితంలో జరిగిందంతా ఆ లయకారుడు కళ్లకు కట్టినట్లు చూపించాడని స్వామిజీ అనడంతో చంద్ర షాక్ అవుతుంది.

కర్మ ఫలం ప్రకారమే జీవితం ముందుకు సాగుతుంది. నీ సమస్య తీరే దారి చూపించడానికే నిన్ను ఆ స్వామి నా దగ్గరకు రప్పించాడని స్వామిజీ అంటాడు. ఏం చేయాలో చెప్పమని చంద్రకళ అడుగుతుంది. కఠోర దీక్ష చేయాలి. శివుణ్ని సేవించాలి. మహా శివుడికి అభిషేకం చేయాలి. పొర్లు దండాలు పెట్టాలి. ఆ క్రతువు ఆటంకం లేకుండా పూర్తి చేయాలి. మధ్యలో ఆగిపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు సిద్ధమేనా అని స్వామిజీ అడుగుతాడు. దేనికైనా సిద్ధమే అని చంద్రకళ అంటుంద...