Hyderabad, అక్టోబర్ 2 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్వేతను భోజనానికి చంద్రకళ కూర్చోబెడుతుంది. విరాట్ లేస్తే అలా వెళ్లడం సంస్కారం కాదని జగదీశ్వరి అంటుంది. దాంతో విరాట్ ఆగిపోతాడు. శ్వేత మీరు మా బావను ఎప్పుడు కలిశారు అని చంద్రకళ అడిగితే.. కాలేజ్‌లో అని శ్వేత చెబుతుంది. సినిమాలో లాగా ఉంటుంది కదా అని చంద్రకళ అందరి ముందే విరాట్ ప్రేమకథ అడుగుతుంది.

సైలెంట్‌గా తినమని జగదీశ్వరి అనడంతో ఊరుకుంటుంది చంద్రకళ. తర్వాత శ్వేతతో ఒంటరిగా చంద్రకళ మాట్లాడుతుంటే శ్యామల కామాక్షి వాళ్లతో వస్తుంది. ఆరోజు విరాట్‌ను వద్దనుకుని మా కొంప ముంచావ్. కొన్ని దుష్ట శక్తులు మా వైపు చూసేవే కావు. ఎందుకు మా విరాట్‌ను వద్దనుకున్నావ్ అని శ్యామల అంటుంది. నా కర్మ అని శ్వేత అంటుంది.

నీకు ఇంకో ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉందని శ్యామల అంటుంది. అర్థం కాలేదని శ్వేత వెళ్లిపోతుంద...