Hyderabad, అక్టోబర్ 5 -- నిన్ను కోరి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో ప్రమోద్ నుంచి శ్వేతను కాపాడి విరాట్, చంద్రకళ తీసుకొస్తారు. జరిగింది అంతా శ్వేత చెప్పడంతో శాలిని వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. దాంతో చిరాకుపడుతుంది. అనంతరం విరాట్‌కు చంద్రకళ రొమాంటిక్‌గా పెయిన్ రిలీఫ్ బామ్ రాస్తుంది.

శ్వేత వచ్చి ఇద్దరికి థ్యాంక్స్ చెబుతుంది. ఇద్దరిని పొగుడుతుంది. వేడి నీళ్లతో కాపుడం పెడితే త్వరగా తగ్గిపోతుందని శ్వేత చెప్పి వెళ్లిపోతుంది. వేడి నీళ్ల కాపడం అంటుంది ఇదివరకు పెట్టిందా అని విరాట్‌ను ఆటపట్టిస్తుంది చంద్రకళ. తమ ప్లాన్ ఫెయిల్ కావడంతో శ్యామలతో మరోసారి ట్రై చేయిస్తారు కామాక్షి, శాలిని.

శ్వేతకు ఇప్పుడు విరాట్ మీద ఫీలింగ్స్ ఉన్నాయో తెలుసుకుని ఒకవేళ ఉంటే చంద్రకళను విడగొట్టేందుకు ప్లాన్ చేస్తారు. చంద్రకళ, శ్వేత ఇద్దరూ వస్తుంటే.. ఏమ్మా నువ్వెప్పుడ...