Hyderabad, మే 11 -- నిన్ను కోరి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో విరాట్ తాళి కట్టడంతో ఇంటికి వెళ్తుంది చంద్రకళ. అక్కడ అంతా ఊరికి వెళ్లడానికి లగేజ్ సర్దుకుని ఉంటారు. విరాట్ తాళి కట్టిన విషయం చంద్రకళ చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. చంద్రకళ మెడలో విరాట్ కట్టిన తాళిని శ్రీరాజ్ తెంచేందుకు ప్రయత్నిస్తాడు.

తాళి మీద శ్రీరాజ్ చేయి వేయగానే పిచ్చి కొట్టుడు కొడుతుంది చంద్రకళ. దాంతో కిందపడిపోతాడు శ్రీరాజ్. అది చూసి అంతా అవాక్కవుతారు. తాళి తెంచడం అంటే భర్త ప్రాణాలు పోయినట్లే. నా భర్త జోలికి ఎవరైనా వస్తే చంపేస్తాను అని శ్రీరాజ్‌కు వార్నింగ్ ఇస్తుంది చంద్రకళ. దాంతో నీకు మేము నువ్వుల నీళ్లు వదిలేయాల్సి వస్తుంది, ఈ ఇంట్లో ఎవ్వరితోను నీకు సంబంధాలు ఉండవు. బంధాలాన్ని తెగిపోతాయి అని వరదరాజులు అంటుంది.

ఎప్పుడో తెంచుకోవాల్సింది వరదరాజులు అని పెద్దనాన్న...