భారతదేశం, డిసెంబర్ 7 -- తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత పరిస్థితులు మారుతాయని చెప్పుకొచ్చారు సీఎం. సోషల్ మీడియాలో సీఎం ఏం పోస్ట్ చేశారంటే..

'జాతి కోసం.. జనహితం కోసం.. గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి.. గొప్ప కార్యాలు చేయాలంటే.. మహా సంకల్పం కావాలి.. సరిగ్గా రెండేళ్ల క్రితం నాకు ఆ ధైర్యం ఇచ్చి.. తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి... నిండు మనస్సుతో ఆశీర్వదించిన తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ రెండేళ్ల ప్రస్థానంలో.. అనునిత్యం అహర్నిశలూ అవని పై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించాను. గత పాలన శిథిలాల కింద కొనఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశాం. రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు దన్నుగా ...