భారతదేశం, డిసెంబర్ 18 -- కొన్నిసార్లు అభిమానం హద్దులు దాటుతుంది. ఇలాంటివి చూసే వీళ్లేం ఫ్యాన్స్ అనిపిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ల మీదకు ఎగబడే విషయంలో అభిమానుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఇలాంటి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమెను చుట్టుముట్టిన అభిమానులు తోసేసుకుంటూ హీరోయిన్ పైకి ఎగబడిపోయారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ రాజాసాబ్. ఇందులోని ముగ్గురు హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఈ మూవీలోని సహన సహన అంటూ సాగే సాంగ్ ను బుధవారం (డిసెంబర్ 17) రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని లూలూ మాల్ లో సాంగ్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి నిధి అగర్వాల్ తో పాటు మరో హీరోయిన్ రిధి కుమార్ అటెండ్ అయ్యారు.

రాజాసాబ్ సాంగ్ సహన సహన సాంగ్ లాంఛ్ ఈవెంట్ కు భారీగా...