భారతదేశం, సెప్టెంబర్ 5 -- రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడం ఎంత ముఖ్యమో చాలామందికి తెలియదు. కేవలం రాత్రి పూట పని చేసే వారికి మాత్రమే నిద్ర పట్టదు అనుకుంటారు. కానీ చాలామంది ఇష్టంతోనో, అలవాటుతోనో రాత్రిపూట మేల్కొంటారు. ఇది చాలా పెద్ద ఆరోగ్య సమస్య అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరిపడా నిద్ర లేకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని, కేవలం నిద్రతోనే గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

హార్ట్‌నెట్ ఇండియా క్లినికల్ అడ్వైజర్, వైట్ లోటస్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ డిసిల్వా హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వివరించారు. గుండెకు విశ్రాంతినివ్వడానికి, రక్తపోటు, హృదయ స్పందన రేటును తగ్గించడానికి నిద్ర ఎలా సహాయపడుతుందో వివరించారు.

నిజానికి, గుండె ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమని...