భారతదేశం, జూలై 24 -- ఆధునిక జీవితంలో పెరిగిన ఒత్తిడి, రోజువారీ పనుల పరుగు పందెంతో మనసు ప్రశాంతంగా లేక నిద్ర పట్టక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ జామ్‌లు, విపరీతమైన పని గంటలతో రోజంతా మెదడు పరుగులు పెడుతుంది. రోజు ముగిసినా, మనసు మాత్రం ఆలోచనల సుడిగుండంలోంచి బయటపడలేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిద్రకు ముందు మనసును ప్రశాంతంగా మార్చుకోవడానికి యోగా ఒక అద్భుతమైన మార్గం. నిద్రకు ముందు మనసును ప్రశాంతంగా ఉంచడంలో యోగా పాత్ర గురించి అక్షర్ యోగా కేంద్ర వ్యవస్థాపకుడు, యోగా నిపుణుడు హిమాలయన్ సిద్ధా అక్షర్ హెచ్‌టి లైఫ్‌స్టైల్‌తో పంచుకున్నారు.

"యోగా మన శరీరానికి బలాన్ని, క్రమశిక్షణను నేర్పుతుంది. కానీ అది మనసును ప్రశాంతంగా ఉంచడానికి కూడా ఒక మార్గం. సున్నితమైన కదలికలతో పాటు లోతైన శ్వాసలు 10 నుంచి 15 సార్లు తీసుకోవడం వల్ల రోజంతా పేరుకుపోయిన ఒత్తి...