భారతదేశం, జూన్ 30 -- చాలామందికి రాత్రి 9-10 గంటలకు లేదా ఇంకా ఆలస్యంగా భోజనం చేసి, వెంటనే నిద్రపోవడం అలవాటు. కానీ ఇది మంచిది కాదని కార్డియాలజిస్ట్ డాక్టర్ అలోక్ చోప్రా చెబుతున్నారు. నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందు భోజనం ముగించడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. పూర్తి విశ్రాంతి తీసుకుంటుంది. ఇతర శరీర పనులు సక్రమంగా జరుగుతాయి. దీనికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు ఆయన.

మీరు గమనించే ఉంటారు. మన తాతయ్యలు, నాయనమ్మలు సాయంత్రం 6-7 గంటల లోపే రాత్రి భోజనం ముగించేవాళ్లు. ఆ తర్వాత ఏమీ తినేవాళ్లు కాదు. నిజానికి, ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ పాటించేవాళ్లు కూడా ఒక నిర్దిష్ట సమయం తర్వాత తినడం మానేస్తారు. ఈ అలవాటు వెనుక చాలా పెద్ద ఆరోగ్య రహస్యమే ఉంది.

మీరు ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ పాటించినా, పాటించకపోయినా, నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందు భోజనం చ...