Hyderabad, సెప్టెంబర్ 17 -- ప్రతి ఒక్కరు కూడా మరో మనిషితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు. ఒక్కొక్కరి తీరు, స్వభావం ఒక్కో విధంగా ఉంటుంది. మన చేతిపై ఉన్న గీతలను చూసి మన జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏ విధంగా సంతోషంగా ఉంటాం అనే విషయాలను చెప్పచ్చు. అదే విధంగా మనం ప్రవర్తించే విధానం, తీరు కూడా మన గురించి చాలా విషయాలు చెప్తాయి.

హ్యాండ్ రైటింగ్ కూడా మనం ఏంటో చెప్తుంది. అదే విధంగా ఒక వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని, గుణాన్ని అంచనా వేస్తారు. అలాగే నిద్రపోయే భంగిమను బట్టి కూడా వ్యక్తిత్వం గురించి చెప్పొచ్చు. మీరు నిద్రించే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే తెలుసుకోండి.

కొంతమంది చిన్నపిల్లలు ముడుచుకుని నిద్రపోయినట్లు నిద్రపోతూ ఉంటారు. అలాంటి వారు ఎలా ఉంటారంటే సైలెంట్‌గా ఉంటారు,...