భారతదేశం, నవంబర్ 25 -- భారత మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మరోసారి భారత సెలక్షన్ పాలసీలపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈసారి అతడు యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నాడు. నితీష్‌కు జాతీయ జట్టులో చోటు దక్కడాన్ని ప్రశ్నించడమే కాకుండా, అతను అంతర్జాతీయ స్థాయిలో ఆల్‌రౌండర్ అనే భావనను కొట్టిపారేశాడు.

తన యూట్యూబ్ షో 'చీకీ చీకా'లో తన కుమారుడు అనిరుద్ధతో కలిసి మాట్లాడిన శ్రీకాంత్.. టీమ్ బ్యాలెన్స్ గురించి చర్చ వచ్చినప్పుడు నితీష్ పేరు ప్రస్తావనకు రావడంతో తీవ్రంగా స్పందించాడు.

"నితీష్ రెడ్డిని ఆల్‌రౌండర్ అని ఎవరు అంటున్నారు?" అంటూ శ్రీకాంత్ తనదైన శైలిలో సూటిగా ప్రశ్నించాడు. "అతని బౌలింగ్‌ను చూసి ఎవరైనా ఆల్‌రౌండర్ అని చెప్పగలరా? మెల్‌బోర్న్‌లో అతను సెంచరీ కొట్టాడు, అది నిజం.. కానీ ఆ తర్వాత అతను ఏం చేశాడ...