భారతదేశం, జూన్ 11 -- టాలీవుడ్ హీరో నితిన్‍కు నాలుగేళ్లుగా సరైన హిట్ లేదు. వరుస ప్లాఫ్‍లు ఎదురయ్యాయి. ఈ ఏడాది నితిన్ నటించిన రాబిన్‍హుడ్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. 'తమ్ముడు' సినిమాపైనే గంపెడాశ పెట్టుకున్నారు నితిన్. ఈ సినిమా జూలై 4వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో తమ్ముడు సినిమాకు ఓటీటీ డీల్ జరిగిందని తెలిసింది.

తమ్ముడు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ మూవీపై అంచనాలు బాగానే ఉండడంతో మంచి ధరకే సొంతం చేసుకుందని తెలుస్తోంది. త్వరలోనే ఓటీటీ పార్ట్‌నర్‌ గురించి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.

తమ్ముడు చిత్రం థియేట్రికల్ రన్ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెడుతుంది. జూలై 4న ఈ మూవీ రిలీజ్ కానుంది. దీ...