భారతదేశం, ఏప్రిల్ 21 -- నితిన్ కొత్త మూవీ 'తమ్ముడు' రిలీజ్ డేట్ పై క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. కచ్చితంగా హిట్ కొట్టాలనే టార్గెట్ తో ఈ మూవీ రిలీజ్ ను మేకర్స్ లేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఫిల్మ్ ను జులై 4న విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. రేపోమాపో మేకర్స్ నుంచి ప్రకటన వచ్చే అవకాశముంది.

నిజానికి 'తమ్ముడు' సినిమాను ఈ ఏడాది మహా శివరాత్రికే రిలీజ్ చేయాలని అనుకున్నారు. రిలీజ్ పోస్టర్ కూడా పోస్టు చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమైంది. ఇంతలో రాబిన్ హుడ్ మూవీ వచ్చేసింది. నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న రాబిన్ హుడ్ బాక్సాఫీస్ డిజాస్టర్ గా నిలిచింది. నితిన్, శ్రీలీల కెమిస్ట్రీ, కామెడీ ఇలా ఏదీ వర్కౌట్ కాలేకపోయింది. ఈ మూవీ రిజల్ట్ తో నితిన్, అతని ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగ...