భారతదేశం, డిసెంబర్ 20 -- పాత‌బ‌స్తీలో నిజాంల నాటి చారిత్ర‌క చెరువుకు హైడ్రా ప్రాణం పోసింది. క‌బ్జాల‌ను తొల‌గించి ఊపిరిలూదింది. ఆక్ర‌మ‌ణ‌ల‌తో ఆన‌వాళ్లే కోల్పోయిన చెరువును బ‌తికించింది. చరిత్ర‌ను త‌వ్వితీసిన మాదిరి చెరువును రూపొందించి చారిత్ర‌క వైభ‌వాన్ని హైడ్రా చాటింది. ఇలా పాత‌బ‌స్తీకే మ‌ణిహారంగా బమ్ -రుక్న్-ఉద్-దౌలా చెరువును స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతోంది.

జ‌న‌వ‌రిలో ఈ చెరువును ప్రారంభించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ శ‌నివారం బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు అభివృద్ధి ప‌నుల‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయింద‌నుకున్న చ‌రిత్ర‌కు ప్రాణం పోస్తున్నాం.. ప్ర‌తి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఈ సంద‌ర్భంగా అక్క‌డ నిర్మాణ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న అధికార...