భారతదేశం, జనవరి 5 -- అమెరికాలోని మేరీల్యాండ్‌లో భారత సంతతికి చెందిన డేటా అనలిస్ట్ నిఖిత గొడిశాల (27) దారుణ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ హత్యకు పాల్పడి అమెరికా నుండి పరారైన ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ (26)ను తమిళనాడులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్‌పోల్ జారీ చేసిన అంతర్జాతీయ నోటీసుల ఆధారంగా సాగిన గాలింపులో నిందితుడు దొరికిపోయాడు.

మేరీల్యాండ్‌లోని కొలంబియాలో ఉన్న అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లో జనవరి 3న నిఖిత శవమై కనిపించింది. ఆమె శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వృత్తిరీత్యా డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్న నిఖితను అర్జున్ అత్యంత కిరాతకంగా చంపినట్లు హౌవార్డ్ కౌంటీ పోలీసులు నిర్ధారించారు. జనవరి 2న అర్జున్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి, నిఖిత కనిపించడం లేదని, ఆమెను చివరిసారిగా న్యూ ఇయర్ వేడుకల సమయంలో చూశానని త...