Hyderabad, జూలై 25 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత నటించిన తొలి సినిమా హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడీ, జ్యోతి కృష్ణ ఈ సినిమాను పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. జూలై 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటోంది.

ఈ నేపథ్యంలో హరి హర వీరమల్లు విజయోత్సవ వేడుకను మూవీ టీమ్ నిర్వహించింది. హరి హర వీరమల్లు విజయోత్సవ వేడుకలో పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "నా జీవితం వడ్డించిన విస్తరి కాదు. నా జీవితంలో ఏదీ అంత తేలికగా జరగదు. ఈ సినిమా విడుదల విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా 29 ఏళ్ల సినీ ప్రయాణంలో నేను ఒక సినిమాని ఇలా ప్రమోట్ చేయడం ఇదే మొదటిసారి" అని అన్నారు.

"ఈ సినిమా బాధ్యత తీసుకోవడం కూడా ఓ రకంగా ఆనందాన్ని ఇచ్చింది. ఏ సినిమాకైన...