Hyderabad, సెప్టెంబర్ 14 -- పిల్లలపై లైంగిక దాడికి వ్యతిరేక నినాదంతో 'అభయమ్ మసూమ్ సమ్మిట్' ఈవెంట్‌ శనివారం (సెప్టెంబర్ 13) నాడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 70 నగరాలు, వేల మంది యంగ్ ప్రొఫెషనల్స్ కలిసి కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)లో భాగంగా యంగ్ ఇండియన్స్ (YI) ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ నిర్వహించారు.

భారత్ రైజింగ్, యంగ్ ఇండియన్స్, కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్, మంత్రి సీతక్క, యంగ్ ఇండియన్స్ కో చైర్మన్ శ్రీ భవిన్ పాండ్య, యంగ్ ఇండియన్స్ నేషనల్ చైర్మన్ తరంగ్ ఖురానా, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ శివ ప్రసాద్ రెడ్డి, శ్రీమతి జోత్స్న సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ .. "మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. సో...