Hyderabad, అక్టోబర్ 12 -- సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా, యూట్యూబర్‌గా చాలా ఫేమస్ అయింది బ్యూటిఫుల్ నిహారిక ఎన్ఎమ్. ఇన్‌స్టాగ్రామ్‌లో కడుపుబ్బా నవ్వించే కామెడీ వీడియోలు, రీల్స్ చేసి నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది నిహారిక ఎన్ఎమ్. అలాగే, టాలీవుడ్ పెద్ద హీరోలతో కొలబారేషన్ వీడియోలు సైతం చేసి అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

మహేశ్ బాబు, అడవి శేష్‌తో మేజర్ సినిమా, విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కంటెంట్ వీడియోలు చేసిన నిహారిక కన్నడ స్టార్ హీరో యశ్‌తో కూడా చేసింది. ఇలా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న నిహారిక ఎన్ఎమ్ తమిళంలో పెరుసు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తెలుగులో హీరోయిన్‌గా అలరించడానికి రెడీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

నిహారిక ఎన్ఎమ్ హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇస్తున్న సినిమా మిత్ర మండలి. ఈ మూవీలో హీరోగా ప్రియదర్శి చేశా...