Hyderabad, ఆగస్టు 12 -- లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ'లో టాలీవుడ్ కింగ్ నాగార్జున.. సైమన్ అనే విలన్ పాత్రలో నటించాడు. ఇటీవల, సినిమా హిందీ ఆల్బమ్ విడుదల సందర్భంగా ముంబైలో జరిగిన స్పాటిఫై ఈవెంట్‌లో నాగార్జున, అనిరుధ్ రవిచందర్, శ్రుతి హాసన్ కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున విలన్ పాత్ర గురించి, షూటింగ్ సమయంలో రజినీకాంత్ నుండి తనకు లభించిన మద్దతు గురించి మాట్లాడాడు.

కూలీ మూవీలో నాగార్జున విలన్ పాత్ర అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. తాను విలన్ పాత్రను ఎందుకు ఎంచుకున్నానో ఈ ఈవెంట్లో నాగ్ వివరించాడు. "నేను ప్రతిసారీ మంచి పాత్రలే పోషిస్తున్నాను. అది కాస్త బోరింగ్‌గా అనిపించింది, కాబట్టి ఒక చెడ్డ పాత్ర చేద్దామని అనుకున్నాను. ఇది చాలా స్వేచ్ఛగా అనిపించింది. కానీ లోకేష్‌ను నేను చాలా కష్టపెట్టాను. నన్ను ఒప్పిం...