Hyderabad, జూన్ 13 -- సమంత రుత్ ప్రభు ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ నటి. తర్వాత మయోసైటిస్ బారిన పడి రెండేళ్లుగా ఒక్క మూవీ కూడా చేయలేదు. అయితే తన వరకూ ఈ స్వేచ్ఛే నిజమైన సక్సెస్ అని, సక్సెస్ అర్థం మారిపోయిందని ఆమె చెప్పింది. ఈ మధ్యే సమంత తొలిసారి నిర్మించిన శుభం మూవీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

సమంత చివరిసారిగా ఫిమేల్ లీడ్ గా నటించిన మూవీ ఖుషీ. 2023లో రిలీజైంది. ఆ తర్వాత ఆమె మరో మూవీలో కనిపించలేదు. ఈ మధ్యే తాను నిర్మించిన శుభం మూవీలో ఓ చిన్న అతిథి పాత్ర మాత్రం చేసింది. ఇప్పుడామె గలాటా ప్లస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సక్సెస్ కు అసలు అర్థం ఏంటన్నదానిపై మాట్లాడింది. ఇప్పుడు తాను సక్సెస్ ను స్వేచ్ఛ పరంగా చూస్తున్నానని చెప్పడం విశేషం.

"ఈరోజు, నా సక్సెస్ కు నిర్వచనం స్వేచ్ఛ. రెండు సంవ...