భారతదేశం, జూలై 9 -- టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన టెస్టు రిటైర్మెంట్ కు మాజీ కోచ్ రవిశాస్త్రి కారణమన్నట్లు హాట్ కామెంట్లు చేశాడు. దినేష్ కార్తీక్ అంటే కమ్ బ్యాక్ కు పేరు. చాలా సార్లు జట్టులో చోటు కోల్పోయినా అతను తిరిగి పుంజుకుని మళ్లీ పునరాగమనం చేశాడు. 2018లో ఎనిమిది సంవత్సరాల తర్వాత అతను టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు.

ప్రస్తుతం ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ కు దినేష్ కార్తీక్ కామెంటేటర్ గా ఉన్నాడు. లార్డ్స్ లో ఈ రెండు జట్లు మూడో టెస్టు ఆడబోతున్నాయి. ఈ నేపథ్యంలో లార్డ్స్ లో తన లాస్ట్ టెస్టు గురించి స్కై స్పోర్ట్స్ పాడ్ కాస్ట్ లో మాట్లాడాడు.

''అప్పటి భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి నా పని అయిపోయిందని చెప్పాడు. నాకు, నాస్ (నాసర్ హుస్సేన్) కు మధ్య పెద్దగా తేడా లేదు. అతను లార్డ్స్ లో ముగించాడు...