భారతదేశం, డిసెంబర్ 15 -- సమాజంలోని సామాజిక అసమానతలపై సోషల్ సెటైరికల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన సినిమా దండోరా. బిగ్ బాస్ శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, బిందు మాధవి, అదితి భావరాజు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు.

డిసెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా దండోరా మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ (డిసెంబర్ 15) మీడియా ఇంటర్వ్యూలో దండోరా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు డైరెక్టర్ మురళీకాంత్.

-మాది మెదక్. నాకు ఓ మంచి సినిమాను తీయాలనే కోరిక ఉండేది. అమెరికాలో జాబ్ చేస్తుండేవాడిని. కానీ, నాకు అది రొటీన్ లైఫ్ అని అనిపించింది. నేను అక్కడ కూడా ఎక్కువగా సినిమాలు చూస్తుండేవాడిని. అలా సినిమాల మీద ఇష్టంతో జీవితంలో రిస్క్ తీసుకుని ఇటు వైపు వచ్చాను.

-నా మెదడులో చాలా కథలు ఉన్నాయి. అయితే ప్రేమ...