భారతదేశం, డిసెంబర్ 8 -- కేరళలో సంచలనం సృష్టించిన 2017 నాటి నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ (Dileep) సోమవారం (డిసెంబర్ 8) నిర్దోషిగా విడుదలయ్యాడు. ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పు తర్వాత బయటకు వచ్చిన దిలీప్.. తన మాజీ భార్య, నటి మంజు వారియర్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ కేసులో తాను నిందితుడిని కాదని, "నిజమైన బాధితుడిని" తానేనని వ్యాఖ్యానించాడు.

లైంగిక వేధింపుల కేసులో తాను నిర్దోషిగా తేలిన తర్వాత మలయాళ నటుడు దిలీప్ మీడియాతో మాట్లాడాడు. కోర్టు బయట రిపోర్టర్లతో మాట్లాడుతూ.. తన ఇమేజ్‌ను, కెరీర్‌ను నాశనం చేయడానికే తన పేరును ఈ కేసులోకి లాగారని దిలీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.

"నా కెరీర్, ఇమేజ్, సమాజంలో నాకున్న గౌరవాన్ని దెబ్బతీయడానికే ఇదంతా చేశారు. అసలు ఈ కేసులో ఏదో కుట్ర దాగి ఉందని ...