భారతదేశం, నవంబర్ 25 -- మాజీ నటి, మాజీ మిస్ ఇండియా రన్నరప్ సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్ పై డొమెస్టిక్ వయోలెన్స్ కేసు దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబై అంధేరి కోర్టులో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ముందు ఆమె ఈ కేసు వేసింది. పీటర్ హాగ్ ఆస్ట్రియాకు చెందిన వ్యక్తి. ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తెలుసు కదా. ఇప్పుడామె తన భర్తపైనే కోర్టుకెక్కింది. గృహ హింస, క్రూరత్వం, మోసం ఆరోపణల కింద డొమెస్టిక్ వయొలెన్స్ చట్టం ప్రకారం సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్ పై కేసు దాఖలు చేసింది. ఈ కేసు ధృవీకరణ, నోటీసు కోసం మంగళవారం (నవంబర్ 25)నాడు అంధేరిలోని లీగల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఎస్.సి. టడ్యే కోర్టు ముందు విచారణకు వచ్చింది.

ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రకారం తన ఆదాయ వనరు...