భారతదేశం, జనవరి 19 -- బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను కొనసాగించడానికి ఆసక్తి ఉన్న యువతకు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్)లో ఉద్యోగ అవకాశం ఉంది. నాబార్డ్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్, రియు డెవలప్‌మెంట్ అసిస్టెంట్(హిందీ) పోస్టులకు నియామకాలను ప్రకటించింది. 162 ఖాళీల కోసం ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 3గా నిర్ణయించారు. నాబార్డ్ వెబ్‌సైట్ https://www.nabard.org/ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.

నాబార్డ్‌లో 159 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ల ఖాళీలు ఉన్నాయి. వీరిని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో నియమిస్తారు. డెవలప్‌మెంట్ అసిస్టెంట్ల (హిందీ) కోసం మూడు ఖాళీలు ఉన్నాయి. మెుత్తం 162 పోస్టులు. ఈ నియామకాలు స్పెషలైజేషన్ ఆధారంగా ఉంటాయి. ఈ నియామకం గ్రూప్ బీ స్థాయిలో ఉంటుంది. ఎంపికైన యువతకు గ్రామీణ ...