భారతదేశం, జనవరి 9 -- టెలివిజన్ రంగంలో 'చిన్నారి పెళ్లి కూతురు'గా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ముద్దుగుమ్మ అవికా గోర్. తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో వార్తల్లో నిలిచింది అవికా గోర్.

2025లో బాయ్‌ఫ్రెండ్ మిలింద్ చంద్వానీని వివాహం చేసుకుంది హీరోయిన్ అవికా గోర్. పతి పత్నీ ఔర్ పంగా అనే టీవీ రియాలిటీ షో వేదికగా ఈ జంట పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే, అవికా గోర్ త్వరలోనే తల్లి కాబోతోందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అవికా గోర్ తన ప్రెగ్నెన్సీ వార్తలపై ఘాటుగా స్పందించారు. "నేను గర్భవతిని అంటూ వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. అందులో ఏమాత్రం నిజం లేదు. అయితే, మా జీవితంలో ఒక కొత్...