భారతదేశం, ఏప్రిల్ 30 -- బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రభుత్వపరంగా సంపూర్ణ మద్దతు ఇచ్చామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. రవీంద్రభారతిలో నిర్వహించిన బసవేశ్వర 892 జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన....పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ...కేసీఆర్ సభపై తొలిసారి స్పందించారు. బీఆర్ఎస్ సభకు వందల బస్సులు ఇవ్వడంతో పాటు వెసులుబాట్లు కల్పించాలని పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు.

"ప్రభుత్వం నుంచి జీతభత్యాలతో సహా అన్ని రకాల వసతులు పొందుతూ ఫామ్ హౌస్ లో ఎందుకు పడుకుంటున్నారో? తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి. కేసీఆర్ మా కళ్లల్లోకి చూడటానికి భయమా? అధికారం ఉంటేనే, ఆదాయం ఉంటేనే మీరు పని చేస్తారా? మా కళ్లల్లోకి చూడటానికి భయమేస్తే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదు? నా పేరు తీయడానికి కూడా కేసీఆర్ కు భయం" -సీఎం రేవంత్ రెడ్డి

తెల...