భారతదేశం, నవంబర్ 9 -- 'కాంతార చాప్టర్ 1' హీరోయిన్ రుక్మిణి వసంత్ తన పేరుతో మోసం చేస్తున్న ఓ వ్యక్తి గురించి తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రజలను హెచ్చరించారు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఒక ఫోన్ నంబర్‌ను పోస్ట్ చేసి, బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ, ఆ వ్యక్తి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు.

రుక్మిణి వసంత్ వార్నింగ్ ఇచ్చారు. ఒక నంబర్‌ను పోస్ట్ చేస్తూ, ఆ నంబర్ వాడుతున్న వ్యక్తి తనలా నటిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని రుక్మిణి వసంత్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

"ముఖ్యమైన హెచ్చరిక & అవగాహన సందేశం. 9445893273 నంబర్‌ను ఉపయోగిస్తున్న ఒక వ్యక్తి నా పేరుతో నకిలీ ప్రచారం చేస్తూ పలువురిని సంప్రదిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఈ నంబర్ నాకు చెందినది కాదు. దీని నుండి వచ్చే సందేశాలు లేదా కాల్స్ పూర్తిగా నకిలీవి....