Hyderabad, సెప్టెంబర్ 27 -- సీనియర్ హీరోయిన్ రాశి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన రాశి ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టారు. అందం, అభినయం, గ్లామర్ షో అన్ని విధాల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం రాశి సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే, సినీ ఇండస్ట్రీలో తనకు చాలా ఇష్టమైన మరో హీరోయిన్ మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు రాశి. జబర్దస్త్ బ్యూటీ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో కిస్సిక్. ఈ షోలో యాంకర్ ప్రశ్నలు అడిగే సందర్భంలో తన పెళ్లికి పిలవాలనుకున్న హీరోయిన్ చనిపోవడం గురించి చెబుతూ కంటతడి పెట్టుకున్నారు రాశి.

"మీరు నటించేటప్పుడు సినీ ఇండస్ట్రీలో నాకు పోటీ అని అనుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా" అని వర్ష అడిగింది. "సౌందర్య స్టాఫ్ మా స్టాఫ్‌తోటి.. అంటే అప్పుడు ఆవిడ ప...