భారతదేశం, జూలై 22 -- ఈ సినిమా డబ్బు కోసమో, రికార్డుల కోసమో కాదు.. ఇది ధైర్యం కోసం, సాహసం కోసం, న్యాయం కోసం అని పవన్ కల్యాణ్ అన్నారు. తన దగ్గర ఆయుధాల్లేవు, గూండాలు లేరు అని వ్యాఖ్యానించారు. ఆయన హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ హరిహర వీరమల్లు మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ సోమవారం (జులై 21) రాత్రి హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ మూవీ జులై 24న రిలీజ్ కానుంది.

హరి హర వీరమల్లు ప్రి రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రేకు పవన్ కల్యాణ్ థ్యాంక్యూ చెప్పారు. ''నేను రాజకీయాల్లోకి వచ్చాక మంచి మిత్రుడిని సంపాదించుకున్నా. ఈ ఈవెంట్ కు వచ్చిన కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రేకు థ్యాంక్యూ. భీమ్లా నాయక్ మూవీ రిలీజైనప్పుడు పవన్ సినిమా టికెట్ ను 10, 15 రూపాయలు చేశారు. అయినా ఆగిపోలేదు. మనల్ని ఎవడ్రా ఆపేది అని చెప్పా. ఇది డబ్బు కోసమో, రికార్డుల క...