భారతదేశం, అక్టోబర్ 31 -- బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఐదేళ్లు గడిచిపోయాయి. కానీ ఇప్పటికే అతని మరణంపై అనుమానాలు మాత్రం వీడటం లేదు. అతనిది ఆత్మహత్య కాదని, ఇద్దరు కలిసి చంపారని తనకు ఇద్దరు మానసిక నిపుణులు తెలిపినట్లు ఓ ఇంటర్వ్యూలో సుశాంత్ అక్క శ్వేత సింగ్ చెప్పడం సంచలనం రేపుతోంది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ లో చనిపోయాడు. అతనిది ఆత్మహత్యే అని పోలీసులు తేల్చారు. సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ బ్యూరోలాంటి సెంట్రల్ ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగినా.. అతని మరణంలో ఎలాంటి అనుమానాలు లేవని తేల్చాయి. అయితే తాజాగా సుశాంత్ అక్క శ్వేతా చేసిన ఆరోపణలు మాత్రం సంచలనం రేపుతున్నాయి.

సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, అక్కడ బెడ్ కు, ఫ్యాన్ కు మధ్య ఉన్న దూరం చూస్తే అది స్పష్టంగా అర్థమవుతోందని చెప్పింది. అతని మెడపైనా ఉరేసుకున్నప్పుడు ద...