భారతదేశం, జనవరి 8 -- ఒక తండ్రికి తన బిడ్డను సాగనంపడం కంటే మించిన శోకం మరొకటి ఉండదు. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రస్తుతం అటువంటి పుత్రశోకంలో మునిగిపోయారు. ఆయన కుమారుడు, హిందుస్థాన్ జింక్ చైర్మన్ అగ్నివేష్ అగర్వాల్ (49) బుధవారం న్యూయార్క్‌లోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదం నుంచి కోలుకుంటున్న సమయంలోనే మృత్యువు ఆయనను కబళించింది.

అగ్నివేష్ అగర్వాల్ అమెరికాలో స్కీయింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం నుంచి బయటపడ్డారని కుటుంబ సభ్యులు భావించారు. కానీ, విధి వెక్కిరించింది. హఠాత్తుగా వచ్చిన గుండెపోటు అగ్నివేష్ ప్రాణాలను బలితీసుకుంది.

ఈ విషాద వార్తను అనిల్ అగర్వాల్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ కన్నీ...