Hyderabad, ఆగస్టు 7 -- 1991లో తన తాత, లెజెండరీ ఎన్టీ రామారావు ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాల నటుడిగా అరంగేట్రం చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వయసు ఎనిమిదేళ్లు. కట్ చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్ స్టార్‌డమ్‌తో తాత సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు.

అయితే తన కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఆ భారాన్ని మోయడం తనకు ఇష్టం లేదని ఎస్క్వైర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు జూనియర్ ఎన్టీఆర్. పితృత్వం, వారసత్వంపై జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తండ్రి అనే బాధ్యత తనను ఒక వ్యక్తిగా మార్చిందని, తాను ఎంచుకున్న పాత్రలను కూడా మార్చిందని తారక్ చెప్పాడు.

"నా పనిలో క్వాలిటీ కోసం వెతకడం ప్రారంభించాను. ఇకపై అది అంత సులువు కాకూడదనుకున్నాను. నన్ను ముందుకు నెట్టే పాత్రలు కావాలి, అక్కడ...