Hyderabad, ఏప్రిల్ 20 -- తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనంతపురం బ్యూటి సుమయ రెడ్డి. కథానాయికగా, నిర్మాతగా, రచయితగా సుమయ రెడ్డి చేసిన సినిమా డియర్ ఉమ. పృథ్వీ అంబర్ హీరోగా చేసిన ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు జరిగిన డియర్ ఉమ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ సుమయ రెడ్డి తల్లి జ్యోతి రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హీరోయిన్ తల్లి జ్యోతి రెడ్డి మాట్లాడుతూ .. "నా కూతురు సుమయ రెడ్డి తీసిన డియర్ ఉమ చాలా బాగా వచ్చింది. హీరోయిన్, ప్రొడ్యూసర్, రైటర్ అయిన సుమయ రెడ్డి నాకు రోల్ మోడల్‌. పదేళ్ల నుంచి కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చింది. ఎవరి కోసమో ఎదురుచూడకుండా కష్టపడి పైకి వచ్చింది. డియర్ ఉమ సినిమాను ఏప్రిల్ 18న అందరూ చూడండి" అని అన్నారు.

ఇదే డియర్ ఉమ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నితిన...