భారతదేశం, నవంబర్ 12 -- ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, ఎస్.ఎస్. రాజమౌళిల భారీ ప్రాజెక్టు 'గ్లోబ్‌ట్రాటర్'. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రియాంకా హైదరాబాద్ లో చాలా రోజులు ఉంది. అయితే ఇక్కడ తాను ఏం చేశానో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పింది.

బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా తన రాబోయే సినిమా 'గ్లోబ్‌ట్రాటర్' (వర్కింగ్ టైటిల్) సందర్భంగా బుధవారం (నవంబర్ 12) సాయంత్రం అభిమానులతో 'ఎక్స్' వేదికగా Q&A సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె తన కూతురు మాల్తీ మేరీకి హైదరాబాద్‌లోని షూటింగ్ సెట్‌లో మహేష్ బాబు కూతురు సితారతో, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఫామ్‌హౌస్‌లో గడిపిన అనుభవం గురించి పంచుకుంది.

"మీరు షూటింగ్‌కు వెళ్లినప్పుడు మీ కుటుంబాన్ని సెట్‌కి తీసుకువస్తారా, లేక పనిపై...