Hyderabad, అక్టోబర్ 3 -- సెలబ్రిటీల పిల్లలైనా ఆన్‌లైన్‌లో వేధింపులు తప్పవని తాజా ఘటన నిరూపిస్తోంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన కూతురి విషయంలో జరిగిన ఓ ఘటన గురించి చెప్పాడు. ముంబైలో జరిగిన ఒక సైబర్ సేఫ్టీ అవేర్‌నెస్ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ మాట్లాడాడు. తన కూతురు నితారాకు ఎదురైన ఒక బాధాకరమైన సంఘటన గురించి పంచుకున్నాడు. సైబర్‌క్రైమ్ సమస్య వేగంగా పెరుగుతోందని, దీనిపై స్కూళ్లలో విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అతడు అన్నాడు.

సైబర్ సేఫ్టీ అవేర్‌నెస్ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ మాట్లాడిన వీడియోను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది. "కొన్ని నెలల కిందట మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సంఘటన గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా కూతురు ఒక వీడియో గేమ్ ఆడుతోంది. కొన్ని వీడియో గేమ్‌లు ఇతరులతో కలిసి ఆడే అవకాశ...